⦿ Top 10 Brain foods – Top 10 బ్రెయిన్ ఫుడ్స్

Best 10 foods for Brain  – మెదడు పనితీరుకు 10 అద్భుతమైన ఆహారాలు:—

మతిమరుపు వేధిస్తున్న,మెదడును చురుకుగా ఉంచుకోవాలన్న ఉపయోగపడే టాప్ 10 బ్రెయిన్ ఫుడ్స్ గురుంచి తెలుసుకుందాం.

**చేపలు :- చేపలలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి .ఇవి మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి,జ్ఞాపకశక్తిని,ఏకాగ్రతను పెంచుతాయి.

**పసుపు :- దీనిలో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది.యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది శరీరంలోని ఇన్ఫెక్షన్లు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

**బెర్రీలు:- బెర్రీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి  రక్షిస్తాయి. వీటిని బ్రెయిన్ సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు.


**డార్క్ చాక్లెట్:-మెదడు పనితీరును మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా  ఉంటాయి. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వలన మెదడు పనితీరు
మెరుగవుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.


**బ్రకోలి:- బ్రకోలి లో ఉండే విటమిన్ K, ఫ్లేవనాయిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వలన అల్జీమర్స్ ,పార్కిన్సన్స్ లాంటివ్యాధులను తగ్గించుకోవచ్చు. దీనిలో పొటాషియం ,విటమిన్ సి కూడా ఉంటాయి.

**నట్స్ & విత్తనాలు:- వీటిలో ఒమేగా 3 ఫాటీయాసిడ్స్ మరియు విటమిన్ E
ఉంటాయి .ముఖ్యంగా వాల్ నట్స్ ఇవి బ్రెయిన్ కి సూపర్ ఫుడ్ ,చూడడానికి బ్రెయిన్ షేప్ లో ఉంటుంది.వీటిని తీసుకోవడం వలన అల్జీమర్స్ ,పార్కిన్సన్స్ లాంటివ్యాధులను తగ్గించుకోవచ్చు.

**ఆకుకూరలు :–వీటిలో C,K,E లాంటి విటమిన్స్ ,ఫ్లేవనాయిడ్స్,యాంటీఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి .

**గుడ్లు :– వీటిలో విటమిన్ A ,D ,B12 , ఒమేగా ఫాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి .
తీసుకోవడం వలన అనేక పోషకాలు ఉంటాయి.ఇవన్నీ కుడా మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి.

**టమాటాలు :-వీటిలో యాంటిఆక్సిడెంట్స్,ఖనిజాలు ,విటమిన్స్,ముఖ్యంగ లైకోపీన్ మెదడు పనితీరుకు సహకరిస్తుంది .ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడగలదని పరిశోధనల్లో తేలింది.

**అవకాడో :- దీనిలో ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు ,విటమిన్ K ,ఫోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.వీటిలో ఉండే ఆరోగ్యమైన కొవ్వులు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడతాయి.

మనం ఏ పని చేసిన దాని గురించి ఆలోచించాలి అప్పుడు బ్రెయిన్ కి కొంత శక్తి అవసరం అవుతుంది.చురుగ్గా ఆలోచించడానికి యాక్టీవ్ గా ఉంచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి.దానితోపాటు వ్యాయామం కూడా చేయాలి అప్పుడే అల్జీమర్స్ ,పార్కిన్సన్ వంటి వ్యాధుల నుండి కాపాడుకోగలం.హ్యూమన్ బాడీ లో అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు.మెదడుపనితీరు సక్రమంగా పనిచేయడానికి ఏకాగ్రతకి ,జ్ఞాపకశక్తికి ,శరీర భాగాలన్నిటికి సిగ్నల్స్ ఇవ్వడానికి పోషకాహారం తీసుకోవాలి,అది సమతులాహారం తీసుకుంటే మంచిది..,

Leave a Comment