⦿ Sugar – చెక్కెరతో జాగ్రత్త

మనం తిన్న ఆహారపదార్థాలు రక్తంలో కొంత గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తాయి, ఎంత గ్లూకోస్ రిలీజ్ అయ్యిందో తెలుసుకునే  రేటింగ్ నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. వయసుతో సంబంధం లేకుండా ఊబకాయం,మధుమేహం,రక్తనాళాలు ,గుండె వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయి వీటన్నిటికీ  కారణం షుగర్స్.మనం తీసుకునే రోజువారీ ఆహారం లో షుగర్ ని ఎంతతక్కువ తీసుకుంటే అంత మంచిది అని Sugar వ్యాధి నిపుణులు అంటున్నారు.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేవి  కమలాలు 20 , చెర్రీలు 25,  నిమ్మకాయలు 20,  పియర్స్30, దానిమ్మ35,  ఆపిల్ 40,  కివి50, గ్రీన్ ద్రాక్ష.
స్ట్రాబెర్రీ.

NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ ప్రకారం ఒకవ్యక్తి రోజుకి 30 గ్రాములు షుగర్ తీసుకోవాలి , 30 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్స్ ని తీసుకోకూడదు.

అధిక gi ఉండే ఆహార పదార్థాలు : రక్తం లో గ్లూకోజ్ లెవెల్స్ ను వేగంగా పెంచే ఆహారపదార్థాలు gi వేల్యూ 70 పైన ఉంటుంది.అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తిన్నప్పుడు అవి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి.

గ్లైసెమిక్ ఇండెక్స్(GI ) వేల్యూ ని 0 -100 ప్రామాణిక స్కేల్ ఆధారంగా కొలుస్తారు.
0 -55 తక్కువ GI వేల్యూ గ్లూకోస్ లెవెల్స్ ని స్లోగా రక్తంలోకి రిలీజ్ చేస్తాయి.
56 -69 మీడియం GI వేల్యూ గ్లూకోస్ లెవెల్స్ ని మీడియం గా రక్తంలోకి రిలీజ్ చేస్తాయి.
70 పైన ఎక్కువ GI వేల్యూ గ్లూకోస్ లెవెల్స్ ని స్పీడ్ గా రక్తం లోకి రిలీజ్ చేస్తాయి.
షుగర్ ఉన్నవారు వీటిని తీసుకోకూడదు:
తెల్ల బియ్యం (వైట్ రైస్)
చక్కెర, తీపి పదార్థాలు
తెల్ల బ్రెడ్
సోడాలు, కొన్ని రకాల స్వీట్లు, గ్లూకోస్ లెవెల్స్ ని స్పీడ్ గా రక్తం లోకి రిలీజ్ చేస్తాయి.
వీటిని షుగర్ ఉన్నవాళ్లు తీసుకుంటే చాల ప్రమాదం,కాబట్టి వీటిని avoid చేయడం మంచిది.

తాజా పండ్లలో తక్కువ GI వేల్యూ ఉంటుంది.ఎక్కువ శాతం పండ్లలో ఫైబర్, ఫ్రక్టోజ్ ఉంటుంది బాగా మాగిన పండ్లలో GI value ఎక్కువ ఉంటుంది .

తాజా పండ్లలో కంటే జ్యూస్ లలో ఎక్కువ GI value ఉంటుంది.పండ్లను నెయ్యి, వేరుశనగ ,గింజలు వంటి నెమ్మదిగా జీర్ణం అయ్యే వాటితో కలిపి తీసుకుంటే రక్తం లో ఇన్సులిన్ సమతూకం గ ఉంటుంది ,ఎందుకంటె వీటిలో ప్రోటీన్ కొవ్వులు ఉంటాయి. జీర్ణ క్రియ వేగం తగ్గి పోషకాల శోషణ కు ఎక్కువ సమయం పడుతుంది.తాజా పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి,జ్యూస్ లు ఎండిన పండ్లలో కంటే ,తాజా పండ్లలో ఫైబర్ తోపాటు ఎక్కువగా పోషకాలు ఉంటాయి
చక్కెర నియంత్రణ చేయాలనుకుంటే మధుమేహం (diabetes) ఉన్నవారు మరియు బరువు తగ్గాలనుకునేవారు అధిక GI ఆహారాలను పరిమితం చేసుకోవాలి.ఎంత ఆహారం తింటున్నారనేది కూడా ముఖ్యం, ఎందుకంటే తక్కువ GI ఉన్న ఆహారం కూడా ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాయధాన్యాలు (legumes), పండ్లు, మరియు ధాన్యాలు వంటి తక్కువ GI ఉన్న ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: పండ్లు,కాయధాన్యాలు,తాజా కూరగాయలు మరియు తాజా పండ్లు.

 

 

 

 

 

Leave a Comment