⦿ Vitamin D – విటమిన్ D

అలసట ఎక్కువగా ఉన్న,చిరాకు,మూడ్ సరిలేకపోవటం ,బలహీనత,కండరాలనొప్పి,జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే విటమిన్ D లోపించి ఉండొచ్చు.ఎక్కువుగా నీడలో ఉండే వాళ్ళకి మరియు ఆడవారిలో విటమిన్ d లోపించి ఉంటింది.

◉ప్రతీరోజూ పెద్దవారికి 15 మైక్రోగ్రామ్ లు అవసరం,చిన్నపిల్లలకి 10 మైక్రోగ్రామ్ లు అవసరం.

◉అంతకన్నా తక్కువ తీసుకుంటే ఎముకలు బలహీనంగా తయారవుతాయి ,తద్వారా రికెట్స్ అనే వ్యాధి వస్తుంది.

◉సరిపడా విటమిన్ d తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

◉డయాబెటిస్ అదుపులో ఉంటుంది

◉విటమిన్ d సరిపడా శరీరానికి అందితే ఎముకలు బలంగా తయారవుతాయి .

D విటమిన్ లభించే మార్గాలు రోజు ఉదయం 15 నిముషాలు సూర్యరశ్మిలో ఉంటే ఆ రోజుకి కావాల్సిన D విటమిన్ లభిస్తుంది.

◉పాలు మరియు పాల ఉత్పత్తుల్లో,సాల్మన్ చేపల్లో ,ఎగ్ లలో,మష్రూమ్ ,విటమిన్ D సప్లైమెంట్స్ కూడా తీసుకోవచ్చు మరియు నువ్వుల్లో అధికంగా ఉంటుంది.దీనిని సన్ షైన్ విటమిన్ అనికూడా అంటారు.ఇది కొవ్వులొ కరిగే విటమిన్

◉ D విటమిన్ సరిపడా అందకపోతే మానసిక రుగ్మతలతోపాటు,ఎముకలు,కీళ్లు,కండరాలు నొప్పి వేధిస్తుంది,అలసటతో పాటు రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది.దీనిని నివారించడానికి రోజు కాసేపు ఎండలో గడపడం వలన మానసిక ఉల్లాసంతో పాటు సరిపద విటమిన్ D అందుతుంది.

 

Leave a Comment