Vitamin C లోపించడం వలన చిగుళ్ళ నుండి రక్తస్రావం రావటం మరియు చర్మంపై పుప్పొడి లేదా గాయాలు గాయాలు మానటంలో ఆలస్యం అలసట, బలహీనత,రోగనిరోధక శక్తి తగ్గడం వలన కనిపించే లక్షణాలు. విటమిన్ సి లో యాంటీఆక్సడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్లు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది విటమిన్ సి (Vitamin C). విటమిన్ సి అనేది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలోని హానికరమైన మూలకాలను నిర్మూలించి, నూతన కణాల తయారీలో సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం వంటి వాటిలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది.

Health benifits of Vitamin C – విటమిన్ సి ప్రయోజనాలు:
Immunuty Booster- ఇమ్యూనిటీ పెంపు – శరీరానికి వ్యాధులు రాకుండా వ్యతిరేకించేందుకు బలాన్ని ఇస్తుంది.
రోజు విటమిన్ సి తీసుకోవడం వలన ఐరన్ శోషణ మెరుగవుతుంది.
చర్మ ఆరోగ్యం కోసం vitamin C తీసుకోవడం వలన కొలాజెన్ తయారీలో భాగస్వామిగా ఉండి చర్మాన్ని పిగ్మెంటేషన్, ముడతల నుండి రక్షిస్తుంది.
గాయాలు త్వరగా మానటానికి విటమిన్ సి అవసరం. తక్కువగా తీసుకుంటే గాయాలు మానటం ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
యాంటీఆక్సిడెంట్ అధికం గా ఉండటం వలన చర్మానికి బిగుతును ,సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజిన్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రక్తనాళాల బలాన్ని పెంచుతుంది గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కాబట్టి ప్రతిరోజూ మన ఆహారంలో విటమిన్ సి ఉన్న పదార్థాలను చేర్చుకోవడం ఎంతో అవసరం.
సౌందర్య పరిశ్రమలో విటమిన్ సి ఓ ప్రముఖమైన పదార్థం. ఇది చర్మాన్ని తేజంగా, మృదువుగా చేస్తుంది. ముడతలు, మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే విటమిన్ సి సీరములు, క్రీములు మార్కెట్లో విస్తృతంగా లభిస్తాయి.

విటమిన్ సి లోపం వల్ల కలిగే సమస్యలు:విటమిన్ సి తక్కువగా తీసుకుంటే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిలో ముఖ్యమైనది స్కర్వీ
-
రోజువారీ జీవితంలో విటమిన్ సి తక్కువ తీసుకోవడం వలన చిగుళ్ల నుండి రక్తస్రావం కలుగుతుంది.
-
సరిపడా తీసుకోకపోతే అలసట, బలహీనత కలుగుతుంది.
-
చర్మంపై నల్ల మచ్చలు వస్తాయి.
-
గాయాలు నెమ్మదిగా మానుతాయి .
-
సరిపడా తీసుకోకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన శరీరం అలసటగా ఉంటుంది.
విటమిన్ సి సగటున పెద్దవారిలో అవసరమయ్యే మోతాదు రోజుకి 75-90mg/day.
పిల్లలుకు అవసరమయ్యే మోతాదు రోజుకి 15-75mg/day.
అధిక మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణ సమస్యలు, కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన పరిమితిలో Doctorను సంప్రదించి తీసుకోవడమే ఉత్తమం.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు:లోపం తలెత్తకుండా ఉండేందుకు పండ్లు, కూరగాయలు రోజూ ఆహారంలో భాగం చేయడం ద్వారా విటమిన్ సి ను తగినంతగా పొందవచ్చు.
అన్ని సిట్రస్ ఫ్రూట్స్ లలో విటమిన్ సి ఉంటుంది.

-
ఉసిరికాయ
-
నిమ్మకాయ
-
కమలాపండు
-
మల్లిడి పండు
-
క్యాప్సికం
-
టొమాటో
-
బొప్పాయ
-
బ్రోకలీ
- కివీ
- పైన్ ఆపిల్
చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం వంటి వాటిలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి తగినంత తీసుకోవడం బెటర్ .
